ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఎఫ్​ఐఆర్.. కీలక విషయాలు

TRS MLA Pilot Rohit Reddy complaint to Moinabad police.ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు య‌త్నించిన వ్య‌వ‌హారంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2022 7:02 AM GMT
ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఎఫ్​ఐఆర్..  కీలక విషయాలు

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు య‌త్నించిన వ్య‌వ‌హారంలో మొయినాబాద్ పోలీసులు ముగ్గురిపై కేసు న‌మోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే ఫైల‌ట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన స‌తీశ్ శ‌ర్మ అలియాస్ రామ‌చంద్ర భార‌తి(ఏ1), హైద‌రాబాద్‌కు చెందిన నంద‌కిశోర్‌(ఏ2), తిరుప‌తికి చెందిన సింహ‌యాజి(ఏ3) పై కేసు న‌మోదు చేసిన‌ట్లు రాజేంద్ర‌న‌గ‌ర్ ఏసీపీ తెలిపారు.

రోహిత్ రెడ్డి ఫిర్యాదులో చెప్పిన విషయాలను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ. 100 కోట్ల ఆఫర్ చేస్తూ తమను సంప్రదించారని రోహిత్ రెడ్డి చెప్పారు. నందకుమార్ మధ్యవర్తిత్వంలో రామచంద్ర భారతి, సింహయాజులు ఫాం హౌస్ లో తమను కలిశారన్నారు. పార్టీ మారితే డబ్బుతో పాటు సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామని చెప్పార‌ని, ఒక‌వేళ పార్టీలో చేర‌క‌పోతే ఈడీ, సీబీఐ కేసులు న‌మోదు చేస్తామ‌ని బెదిరించిన‌ట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. త‌న‌కు రూ.100కోట్లు, త‌న‌తో పాటు పార్టీలో చేరే వారికి రూ.50 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్లు రోహిత్ రెడ్డి చెప్పిన‌ట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టు చేసిన ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. వారి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మొయినాబాద్ ఫాం హౌస్ లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఫాం హౌస్ లోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు.

Next Story
Share it