చంద్రబాబుకు షాక్ : టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణకు టీఆర్ఎస్ ఆహ్వానం.!

TRS Invites TDP Leader L Ramana. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ టీడీపీ నుండి భారీ షాక్ తగలనుంది.

By Medi Samrat  Published on  7 Jun 2021 10:44 AM GMT
చంద్రబాబుకు షాక్ : టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణకు టీఆర్ఎస్ ఆహ్వానం.!

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ టీడీపీ నుండి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమ‌వుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. రమణను టీఆర్ఎస్‌లో చేర్చకునేందుకు సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పచ్చజెండా ఊపిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు రమణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చలు జరిపి.. పార్టీలోకి ఆహ్వానించిన‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలావుంటే.. తెలంగాణ‌లో ఈ నెల 3వ తేదీన ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామ‌న్న హామీతో పార్టీలోకి పిలుస్తున్న‌ట్లు కూడా వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇదే స‌మ‌యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన బీసీ నాయకుడిగా స్థానం సంపాదించుకున్న ఈటెల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసిన నేఫ‌థ్యంలో రమణను చేర్చుకుని.. ఆ ఖాళీని భర్తీ చేయాలనే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఎల్. రమణ విష‌యానికొస్తే.. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణలో దాదాపుగా టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేఫ‌థ్యంలో రమణ తన రాజకీయ జీవితంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన టీఆర్ఎస్ లో చేరుతారా లేదా అనే విష‌య‌మై స్ప‌ష్ట‌త రావాల్సి వుంది. ర‌మ‌ణ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరితే.. చంద్ర‌బాబుకు గ‌ట్టి షాక్ త‌గిలే అవ‌కాశ‌ముంది. ర‌మ‌ణ‌తో పాటు ఉన్న కొద్దిమంది నేత‌లు కూడా టీడీపీని వీడే అవ‌కాశ‌ముంది. అదే జ‌రిగితే టీడీపీకి తెలంగాణ‌లో డోర్స్ క్లోజ్ అయిన‌ట్టే.

ఇదిలావుంటే.. పార్టీ మారుతున్నార‌న్న‌ వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు. జూన్ 1న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసి సీఎం కేసీఆర్.. మిమ్మల్ని గుర్తు చేసారని చెప్పారని ఎల్. రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి కూడా రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని ర‌మ‌ణ‌ తెలిపారు. గతంలో కూడా టిఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింద‌ని.. ఇది కొత్త ఏం కాదని వెల్లడించారు. పార్టీ మార్పుపై ఎలాంటి ఆలోచన చేయలేదని.. తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం అయిన తీసుకుంటానని ఎల్ రమణ పేర్కొన్నారు.



Next Story