హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పటిష్టం చేస్తున్నారని వైద్యఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో మానిటరింగ్ హబ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 887 పీహెచ్‌సీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశామన్నారు. మెరుగైన పర్యవేక్షణ కోసం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టీఎస్‌ఎమ్‌ఐడీసీలను విలీనం చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో ఎక్కడి నుంచైనా ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షించవచ్చని తెలిపారు
ల్యాబ్‌ను, ఫార్మసీని అధికారులు ఎప్పుడైనా పర్యవేక్షించవచ్చు. సీసీటీవీల వల్ల అదనపు భద్రత ఉంటుందని, ఈ తరహా పర్యవేక్షణ కౌంట్‌లో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలకు రూ.67 కోట్లతో 43 కొత్త భవనాలు నిర్మించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. 372 పీహెచ్‌సీల్లో మరమ్మతుల కోసం రూ.43.18 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 1239 సబ్ సెంటర్లు మంజూరు చేశామని, ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు.