గుడ్‌న్యూస్‌.. త్వరలోనే 19 వేల మంది టీచర్లకు పదోన్నతులు!

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన షెడ్యూల్‌ నేడో, రేపో విడుదల అయ్యే ఛాన్స్‌ ఉంది.

By అంజి  Published on  7 Jun 2024 1:13 AM GMT
Transfers, promotions, teachers, Telangana

గుడ్‌న్యూస్‌.. త్వరలోనే 19 వేల మంది టీచర్లకు పదోన్నతులు!

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన షెడ్యూల్‌ నేడో, రేపో విడుదల అయ్యే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు చూసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈ పదోన్నతులకు పచ్చ జెండా ఊపడమే ఆలస్యంగా మారింది. ఈ ప్రక్రియ పూర్తి అయితే 10,449 మందికి ఎస్‌ఏలుగా, 778 మంది గెజిటెట్‌ ప్రధానోపాధ్యాయులుగా, 6 వేల మంది ఎస్‌జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఒకట్రెండు రోజుల్లోనే టీచర్ల పదోన్నతుల షెడ్యూలు విడుదల కావొచ్చని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. పోయిన ఏడాది ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు కానుంది. మల్టీ జోన్‌-1లో కొంత ప్రక్రియ పూర్తయినందువల్ల దానికి ఒక షెడ్యూలు, మల్టీ జోన్‌-2కు మరో షెడ్యూలు జారీ కానున్నాయి. మల్టీ జోన్‌-1లో స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మల్టీ జోన్‌-2కు మరో షెడ్యూలు రానుంది.

Next Story