విషాదం.. స్లాబ్‌ వేస్తుండగా కూలిన చర్చి.. నలుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్లాబ్‌ వేస్తుండగా చర్చి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

By అంజి  Published on  7 Jan 2024 2:54 PM IST
Sangareddy district, church , Church Collapse, Kohir Church

విషాదం.. స్లాబ్‌ వేస్తుండగా కూలిన చర్చి.. నలుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్లాబ్‌ వేస్తుండగా చర్చి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో నిర్మా ణంలో ఉన్న ఓ చర్చి కూలిపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కోహిర్‌లో మెథడిస్ట్ చర్చి నిర్మాణం జరుగుతోంది. అయితే ఈరోజు విధి నిర్వహణలో భాగంగా కూలీలందరూ వచ్చి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలకు తీవ్రగాయాలు కావడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్లాబ్‌ శిథిలాల్లో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు కూలీలను బయటకు తీసేందుకు పోలీసులు,రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మృతుల కుటుంబాలు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story