విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి

మేడ్చల్ జిల్లాలోని గౌడవెల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో తండ్రి ఇద్దరు కూతుర్లను రైలు ఢీ కోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

By అంజి  Published on  11 Aug 2024 6:13 PM IST
Medchal district, train, gowdavalli railway station, Telangana

విషాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి

మేడ్చల్ జిల్లాలోని గౌడవెల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు కూతుర్లతో సహా తండ్రి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో తండ్రి ఇద్దరు కూతుర్లను రైలు ఢీ కోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ.. గౌడవెల్లిలో రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ చెకింగ్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం కావడంతో తన ఇద్దరు కూతుర్లను తీసుకొని డ్యూటీకి వచ్చాడు. కృష్ణ పనిచేస్తుండగా తన కూతుర్లు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్న సమయంలో రైలు వేగంగా అటు వైపు వచ్చింది.

రైలును గమనించిన కృష్ణ తన ఇద్దరు కూతుర్లను కాపాడబోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ట్రైన్ వేగంగా రావడంతో ముగ్గురిని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన కూతుర్ల పేరు వర్షిత ,వరిణిగా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఇద్దరు కూతుర్లు మరణించడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారి మనసులను తీవ్రంగా కలిచివేశాయి.

Next Story