తెలంగాణలో విషాదం..విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాయాధారిపేట గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

By -  Knakam Karthik
Published on : 9 March 2026 4:30 PM IST

Telangana, Mancherial, Electrocution, Tragic Incident, Dandepally

తెలంగాణలో విషాదం..విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాయాధారిపేట గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మాయాధారిపేటకు చెందిన లక్ష్మీనారాయణ, కాజీపేటకు చెందిన నాగరాజు ఒక ఇనుప వస్తువును తీసుకెళ్తుండగా, అది ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story