రహదారిపై లారీ బోల్తా.. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో 4 కి.మీ మేర ట్రాఫిక్ జామ్‌

Traffic jam on Hyderabad-Vijayawada highway.హైద‌రాబాద్ - విజ‌య‌వాడ జాతీయ రహ‌దారి 65పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Nov 2021 9:28 AM GMT
రహదారిపై లారీ బోల్తా.. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో 4 కి.మీ మేర ట్రాఫిక్ జామ్‌

హైద‌రాబాద్ - విజ‌య‌వాడ జాతీయ రహ‌దారి 65పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 4.కి.మీ మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. న‌ల్ల‌గొండ జిల్లా చిట్యాల మండ‌లం గండ్రాంప‌ల్లి వ‌ద్ద అదుపు త‌ప్పి ఓ లారీ బోల్తా ప‌డింది. డివైడ‌ర్‌ను ఢీ కొన్న లారీ రోడ్డు మధ్య‌లో ప‌డిపోవ‌డంతో రాక‌పోక‌ల‌ను అంత‌రాయం క‌లిగింది. సుమారు 4 కి.మీ మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో లారీని రోడ్డు మ‌ధ్య‌లోంచి ప‌క్క‌కు తొల‌గించారు. అనంత‌రం ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేప‌ట్టారు.

Next Story
Share it