జన్వాడ భూములన్నీ కేటీఆర్‌వే.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

జన్వాడ పామ్ హౌస్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు

By Medi Samrat  Published on  21 Aug 2024 4:26 PM IST
జన్వాడ భూములన్నీ కేటీఆర్‌వే.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

జన్వాడ పామ్ హౌస్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. జన్వాడ భూములన్నీ కేటీఆర్‌వేన‌ని.. ఎలాంటి సందేహం లేదన్నారు. నాళాలన్నీ కూలగొట్టి కేటీఆర్ పామ్ హౌస్ కట్టాడ‌ని ఆరోపించారు. కేటీఆర్ కు పౌరుషం ఉంటే పామ్ హౌస్ ని కులగొట్టాలి.. అప్పుడు మేము హర్షిస్తామ‌న్నారు. ఆ రోజు డ్రోన్ తిరుగుతుంటే కేటీఆర్ కు అక్కడ ఏమి పని అని ప్ర‌శ్నించారు. FTL లో ఉన్న ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. హైడ్రాకు మంచి పేరు వస్తుందని.. విగ్రహాల పేరుతో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కేటీఆర్, హరీష్ రావుల శకం ముగిసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూలిపోయే పరిస్థితిలో బీజేపీని పట్టుకొని వేలాడుతున్నారని అన్నారు. దురాక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్థులను హైడ్రా కాపాడుతుందన్నారు.

హైడ్రాపై రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని టీపీసీసీ అభినందిస్తుందన్నారు. లక్ష చదరపు అడుగుల్లో పామ్ హౌస్ ఉందని.. ఎవరైనా భూములను లీజుకు తీసుకుంటారు.. కానీ కేటీఆర్ మిత్రుడి పామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నా అని కొత్త డ్రామా కు తెర లేపిండు.. అది కేటీఆర్ పామ్ హౌస్ అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారని అన్నారు. అక్రమ కట్టడమని రేవంత్ రెడ్డి NGT కి వెళితే అరెస్ట్ చేశార‌ని గుర్తుచేశారు.

జన్వాడ పామ్ హౌస్ భూములన్నీ ఆయన సతీమణి శైలిమ పేరు మీద ఉన్నాయ‌ని ఆరోపించారు. పామ్ హౌస్ ను కూడా ప్రైవేట్ వ్యక్తిని బెదిరించి లాక్కున్నాడని అన్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్నావు.. ఎక్కడ ఫారెస్ట్ భూములు, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలియదా అని ప్ర‌శ్నించారు. 40 లక్షల మందికి రుణమాఫీ లబ్ది చేకూరిందన్నారు. ప్రతి పక్షాలు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Next Story