కేటీఆర్ రూ.50 కోట్లు ఇచ్చినా కూడా తీసుకుంటాం : TPCC చీఫ్

మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ, అంబానీల ఆస్తులు వందల రెట్లు పెరిగిపోయాయని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on  22 Nov 2024 3:45 PM GMT
కేటీఆర్ రూ.50 కోట్లు ఇచ్చినా కూడా తీసుకుంటాం : TPCC చీఫ్

మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ, అంబానీల ఆస్తులు వందల రెట్లు పెరిగిపోయాయని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మోదీ అధానీ,అంబానీ లకు వెసులుబాటు లు కల్పిస్తున్నారని ఆరోపించారు. అదానీ స్టాక్ మార్కెట్ ను మ్యనుప్యూలెట్ చేశారు.. అదానీపై ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు.. అదానీ అరెస్ట్ అయితే మన ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు.. అందుకే మోదీ అదానీపై నోరు మెదపడం లేదన్నారు.

అదానీ మోసాలలో ప్రధానికి కూడా ప్రధాన భాగస్వామ్యం ఉంది కాబట్టే మాట్లాడడం లేదన్నారు. అదానీని అరెస్ట్ చేయాలి.. అదానీ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అదానీ స్కిల్ యూనివర్శిటీకి 100 కోట్లు ఇచ్చారు.. స్కిల్ యూనివర్శిటీకి కేటీఆర్ రూ.50 కోట్లు ఇచ్చినా కూడా తీసుకుంటామన్నారు. డబ్బు వ్యామోహం కన్నా రాజకీయం వ్యామోహంతో చేసే పనులు చాలా డేంజ‌ర్ అన్నారు.

అదానీకి మేము తెలంగాణలో గుంట భూమి కూడా ఇవ్వలేదన్నారు. అదానీ న్యాయంగా ఒప్పందాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. మా ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళతామన్నారు. చట్ట రీత్యా ఎవరు వ్యాపారం చేసినా మేము యాక్సెప్ట్ చేస్తామన్నారు. పేద ప్రజల అభ్యున్నతి మా స్టాండ్.. బీజేపీ, బీఆర్ఎస్‌ ఒక్కటేన‌న్నారు. దుబాయ్ లో నేరం చేస్తే ఇక్కడ నేరం చేసినట్టు అవుతుందా అని ప్ర‌శ్నించారు.

Next Story