తెలంగాణ కోసం కేటీఆర్, కవిత ఏం త్యాగం చేశారు.? : టీపీసీసీ చీఫ్‌

తెలంగాణ ప్రదాత ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ 78 వ జన్మదినోత్సవ వేడుకలను డిసెంబర్ 9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తాం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  6 Dec 2024 3:54 PM IST
తెలంగాణ కోసం కేటీఆర్, కవిత ఏం త్యాగం చేశారు.? : టీపీసీసీ చీఫ్‌

తెలంగాణ ప్రదాత ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ 78 వ జన్మదినోత్సవ వేడుకలను డిసెంబర్ 9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తాం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ లేనిదే.. తెలంగాణ లేదన్నారు. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ది పనులను కాంగ్రెస్ ఏడాదిలో చేసి చూపించిందన్నారు.

ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. అధికారం కోల్పోయిన కేటీఆర్ అహంకార ధోరణి వీడలేదన్నారు. కేటీఆర్ పగటి కలలు కంటున్నారు.. లక్షల కోట్లు దోపిడీ చేసిన మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలా అనుకుంటున్నారన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ కోసం కేటీఆర్, కవిత ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు.

దేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే అది కేసిఆర్ కుటుంబమే అన్నారు. బిఆర్ఎస్ హయంలో స్వేచ్చ కొరవడింది.. సీఎం రేవంత్ హయంలో స్వేచ్ఛకు కొదువ లేదన్నారు.

కౌశిక్ రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు.. పదేళ్ల నిరంకుశ పాలన కు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రతిపక్ష నాయకుడిని ఫాం హౌస్ లో బంధించి కేటీఆర్, హరీష్ పిల్ల చేష్టలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.

Next Story