మేం చేసిన దానికి ఆమె రంగులు పూసుకోవడమేంటి?..కవితకు టీపీసీసీ చీఫ్‌ కౌంటర్

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తమ విజయమే అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ కవితకు.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు

By Knakam Karthik
Published on : 11 July 2025 2:30 PM IST

Telangana, Bc Reservations, Tpcc Chief Mahesh Kumar Goud, Brs Mlc Kavitha

మేం చేసిన దానికి ఆమె రంగులు పూసుకోవడమేంటి?..కవితకు టీపీసీసీ చీఫ్‌ కౌంటర్

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తమ విజయమే అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ కవితకు.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు .గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కవిత కౌన్ కిస్కా? కవిత లేదు, భవిత లేదు. మేం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి?. కవిత ను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. చోటా మోటా ధర్నాలు చేసి నావల్లే అయింది అనడం ఏంటి?. బీసీ రిజర్వేషన్లకు కవితకి సంబంధం లేదు. ఆమె ప్రమేయం లేదు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ ఎజెండా, రేవంత్ కమిట్మెంట్..అని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

Next Story