తెలంగాణలో త్వరలోనే టూరిస్ట్ పోలీస్: డీజీపీ

రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు

By Knakam Karthik
Published on : 14 Aug 2025 8:02 AM IST

Telangana, DGP Jithendar, Tourist police, Tourist Places

తెలంగాణలో త్వరలోనే టూరిస్ట్ పోలీస్: డీజీపీ

రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. డీజీపీ కార్యాలయంలో పర్యాటకశాఖ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టూరిజం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, లా & ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్, టూరిజం ఎండి వి. క్రాంతి, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి చ. ప్రియాంకతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తామని డీజీపీ వెల్లడించారు. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదాద్రి, పోచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఈ యూనిట్లు పనిచేయనున్నాయి. షూటింగ్ పర్మిట్లు, ప్రత్యేక ఈవెంట్ల నిర్వహణకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని డీజీపీ జితేందర్ వెల్లడించారు.

Next Story