తెలంగాణ సీఎం రేవంత్‌కు టాలీవుడ్ డైరెక్టర్‌ బహిరంగ లేఖ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  12 Dec 2023 10:32 AM GMT
tollywood director, letter,  telangana, cm revanth reddy,

 తెలంగాణ సీఎం రేవంత్‌కు టాలీవుడ్ డైరెక్టర్‌ బహిరంగ లేఖ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండ్రోజుల్లోనే ఆరు గ్యారెంటీల ఆమలుపై ఫోకస్‌ పెట్టారు. అంతేకాదు.. అందులో రెండింటిని ఇంప్లిమెంట్ కూడా చేశారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి మంచి ఆదరణ వస్తోంది. గతంలో ఎప్పుడో ఆగిపోయిన ప్రజదర్బార్‌ కార్యక్రమం పేరుని మార్చి ప్రజావాణిగా నిర్వహిస్తున్నారు. రైతుబంధు నిధులతో పాటు ఇతర కార్యక్రమాలపై ముమ్మరంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డికి టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ రాశారు. సినీ, ప్రజా సమస్యలను తెలియజేస్తూ.. వాటిని త్వరగా పరిష్కరించాలంటూ రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కూడా సినిమా అవార్డులు, ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహించాలని లేఖలో కోరారు డైరెక్టర్‌ సంజీవ్‌రెడ్డి. అవార్డులు అందించడం ద్వారా కళాకారులను ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

అర్హులైన కళాకారులు, సాంకేతిక నిపుణులకు, పాత్రికేయులకు ఇల్లు లేదంటే స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, చైన్యవంతమైన సృజనాత్మక వాతావరణానికి దోహదపడాలని సంజీవ్‌రెడ్డి తాను రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్‌ వాసిగా మరో విజ్ఞప్తి అంటూ.. నాళాల సమస్యలను, ట్రాఫిక్ కష్టాలను వివరిస్తూ దర్శకుడు సంజీవ్‌రెడ్డి కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే.. సంజీవ్‌రెడ్డి తెలుగులో అల్లు శిరీష్‌తో ఏబీసీడీ అనే సినిమాను తీశారు. ఆ తర్వాత రాజ్‌తరుణ్‌తో 'ఆహా నా పెళ్లంట' వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు.

Next Story