బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను ప్రభావం బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. వర్షాల ప్రభావం ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాగా, నివర్ తుఫాను ధాటికి తమిళనాడు, పుదుచ్చేరిల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లో ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపు నివర్ తుఫాను నేపథ్యంలో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాణ నస్టం,ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.