నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..లాక్‌డౌన్‌ను పొడగిస్తారా..!
Today Telangana cabinet meeting.తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ నేటితో(మే 30)
By తోట వంశీ కుమార్ Published on 30 May 2021 2:09 AMతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ నేటితో(మే 30)తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నాం 2 గంటలకు కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పైనే కీలకంగా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలా..? వద్దా..? అనే దానిపై చర్చించడంతో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమూ అన్ని కార్యకలాపాలకు అనుమతిఇచ్చారు. ఆ తరువాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. రోజులో 20 గంటలు లాక్‌డౌన్ అమలు అవుతోంది. నేటితో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నారు సీఎం. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరిగా మూడు వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం.. బ్లాక్ పంగస్ కేసులు పెరుగుతుండడంతో మరికొద్ది రోజులు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే మేలని ప్రభుత్వం బావిస్తున్నట్లు తెలుస్తోంది. వారం నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్పై స్పష్టత రావాలంటే మరో కొన్ని గంటలు వేచివుండాలి.