గుడ్‌న్యూస్‌.. నేడు అకౌంట్లలో డబ్బుల జమ

రాష్ట్రంలో నేటి నుంచి విడతల వారీగా 'రైతు భరోసా', 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమకానున్నాయి.

By అంజి
Published on : 27 Jan 2025 6:34 AM IST

Rythu Bharosa, Indiramma Atmiya Bharosa funds, beneficiaries, Telangana

గుడ్‌న్యూస్‌.. నేడు అకౌంట్లలో డబ్బుల జమ

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేటి నుంచి విడతల వారీగా 'రైతు భరోసా', 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమకానున్నాయి. తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో పడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సుమారు 10 లక్షల మంది రైతు కూలీలకు 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' అందే సూచనలు ఉన్నట్టు సమాచారం.

ఒకే రోజు నాలుగు సంక్షేమ పథఖాలు ప్రారంభించి నవశకానికి నాంది పలికామని సీఎం రేవంత్‌ ట్వీట్‌ చేశారు. 'రైతును రాజును చేసే రైతు భరోసా', కూలీకి చేయూతనిచ్చే 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా', పేదల సొంతింటి కల సాకారం చేసే 'ఇందిరమ్మ ఇళ్లు',, అన్నార్తుల ఆకలి తీర్చే 'కొత్త రేషన్‌ కార్డులు' వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని, ఈ సరికొత్త అధ్యాయాన్ని తన సొంత నియోజకవర్గంలో ప్రారంభించానని పేర్కొన్నారు.

Next Story