అమ్రాబాద్ టు దత్తాయిపల్లి అడవులు..ఆడ తోడు కోసం పులి సంచారం

యాదగిరిగుట్ట సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది

By -  Knakam Karthik
Published on : 27 Jan 2026 3:59 PM IST

Telangana, Yadagirigutta, Tiger roaming, Dattaipalli Forests

అమ్రాబాద్ టు దత్తాయిపల్లి అడవులు..ఆడ తోడు కోసం పులి సంచారం

యాదగిరిగుట్ట సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా పరిసర అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తాజాగా దత్తాయిపల్లి అడవుల్లో ఏర్పాటు చేసిన నైట్ విజన్ ట్రాప్ కెమెరాకు పులి కదలికలు చిక్కడంతో అప్రమత్తమయ్యారు. అమ్రాబాద్ అడవుల నుంచి ఆడ తోడు కోసం ఈ పులి ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆవులు, మేకలను బలి తీసుకున్న ఘటనలు చోటుచేసుకోవడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రజలు అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది. గ్రామాల్లో పులి తిరుగుతూ ఆవు లేక దూడలను చంపే తింటూ ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు త్వరగా పులిని పట్టుకోవాలంటూ గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరారు. అయితే అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి దృశ్యాలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకునేంతవరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు ఒంటరిగా బయటికి వెళ్ళరాదని..ముఖ్యంగా చిన్నపిల్లలను బయటికి పంపించవద్దని అధికారులు సూచించారు.

Next Story