ఈ ఏడాది ఆలస్యంగా రుతు పవనాలు.. కరువు ఏర్పడేందుకు అవకాశం
ఈ సంవత్సరం నైరుతి రుతు పవనాలు 4 రోజులు ఆలస్యంగా భారత్‌ను పలుకరిస్తాయని భారత వాతావరణ విభాగం మంగళవారం నాడు వెల్లడించింది.
By అంజి Published on 17 May 2023 3:45 AM GMTఈ ఏడాది ఆలస్యంగా రుతు పవనాలు.. కరువు ఏర్పడేందుకు అవకాశం
ఈ సంవత్సరం నైరుతి రుతు పవనాలు 4 రోజులు ఆలస్యంగా భారత్‌ను పలుకరిస్తాయని భారత వాతావరణ విభాగం మంగళవారం నాడు వెల్లడించింది. జూన్ 4వ తేదీన నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకే ఛాన్స్ ఉందని, దేశంలో సాధారణ వర్షపాతం 83.5 సెంటీ మీటర్ల దాకా నమోదు కావచ్చని అంచనా వేసింది. ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ.. సాధారణ వర్షపాతం పడుతుందని తెలిపింది. ప్రతి ఏడాది జూన్ 1వ తేదీన రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాలి. కానీ గత ఐదేళ్లలో పోయిన ఏడాది మాత్రమే జూన్ 1వ తేదీన రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి.
ఈ రుతుపవనాలు వ్యవసాయ పనుల ఆరంభానికి సూచిక. దేశంలో అత్యధిక భాగంలో ఈ రుతు పవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదుకానుండటంతో పాటు, ఎల్‌నినో ఏర్పడే అవకాశమున్నదని తెలిపింది. సెకండ్ సీజన్‌లో దీని ప్రభావం కనిపిస్తుందని ఏప్రిల్‌లో భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దేశంలోని వాయువ్య, పశ్చిమ, మధ్య, ఈ శాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి లోటు వర్షం పాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది కరువు ఏర్పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.
అయితే సాధారణం కంంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్య ఛాన్స్ 67 శాతం ఉందని ఐఎండీ వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు. గణాంకాల ప్రకారం.. దేశంలో 2019 రుతుపవనాల సీజన్‌లో 971.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2020లో వర్షపాతం 961.4 మిల్లీమీటర్లుగా ఉన్నది. 2021లో 874.5 మిల్లీమీటర్లు, 2022లో 924.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్టు ఐఎండీ వెల్లడించింది.