నీతి ఆయోగ్ మూడో ఎడిషన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో ప్రధాన రాష్ట్రాలలో కర్ణాటక, హర్యానాలతో పాటు తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. నీతి ఆయోగ్ రూపొందించిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో సబ్‌నేషనల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, సామర్థ్యాలను అంచనా వేసింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఆధారంగా ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను రూపొందించారు. గురువారం న్యూఢిల్లీలో సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ సమక్షంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ సూచీని విడుదల చేశారు.
మొదటి, రెండవ ఎడిషన్‌లు వరుసగా అక్టోబర్ 2019, జనవరి 2021లో ఇన్నోవేషన్ ఇండెక్స్ సూచీలను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో ఆవిష్కరణలకు కావాల్సిన సామర్థ్యం, వాతావరణం ఎలా ఉందో గమనించి ఈ ర్యాంకులను ప్రజెంట్ చేస్తారు. వరుసగా మూడవ సారి కర్నాటక ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ) సూత్రాలకు అనుగుణంగా జాతీయ స్థాయి ఆవిష్కరణ సూచీలను రూపొందించారు. దీని కోసం 66 విశిష్టమైన ఇండికేటర్స్‌ను ప్రవేశపెట్టారు. పెద్ద రాష్ట్రాల క్యాటగిరీలో కర్నాటక టాప్ రాగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల క్యాటగిరీలో మణిపూర్, కేంద్ర పాలిత ప్రాంతాల క్యాటగిరీలో చండీఘడ్ మొదటి స్థానాల్లో నిలిచాయి.