'తెలంగాణలో బీర్ల కొరత లేదు'.. మద్యం ప్రియులకు ఎక్సైశ్‌ శాఖ శుభవార్త

తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు 2.00 లక్షల కేసులు అమ్మకాలు జరుగుతాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రెవరీస్‌ కార్పొరేషన్‌ డిపోల్లో, బ్రూవరీస్‌ల్లో నిల్వలు ఉన్నాయి.

By అంజి  Published on  31 May 2024 1:39 AM GMT
beers, Telangana, Excise Department

'తెలంగాణలో బీర్ల కొరత లేదు'.. మద్యం ప్రియులకు ఎక్సైశ్‌ శాఖ శుభవార్త 

తెలంగాణలో బీరు తయారు చేసే బ్రూవరీస్‌ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిరదని మీడియాలో వచ్చిన కథనం సత్యదూరమని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్‌మెంట్‌ కమిషనర్‌, ఎన్‌డీ/ ఈ శ్రీధర్‌ తెలపారు. ప్రస్తుతం తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే బ్రూవరీస్‌ కంపెనీలు ఉన్నాయని, ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసన్స్‌ షరతుల ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుందని తెలిపారు. సాదారణంగా ఒక షిప్టుకు అనుమతి ఉంటుంది. కానీ బీరు డిమండ్‌ మేరకు, బ్రూవరీస్‌ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుం చెల్లించిన వారికి మూడు షిప్టులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.

''ఆరు బ్రూవరీస్‌లో, నాలుగు బ్రూవరీస్‌ 95 శాతం వారి డిమాండ్‌ కలిగిన బ్రాండ్స్‌ని ఉత్పత్తి చేస్తున్నాయి. బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే నాలుగు కంపెనీలకు మూడు షిప్టులకు అనుమతి తీసుకున్నారు. డిమాండ్‌ ఉన్న నాలుగు కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామర్ధ్యం 1,66,000 కేసులు. ఇలా మూడు షిప్టుల్లో 4,98,000 కేసులు తయారు చేయాల్సి ఉంటుంది. కాని మూడు షిప్టులు నడుపుకోవడానికి అనుమతి తీసుకున్న కంపెనీలు మూడు షిప్టుల్లో కేవలం 2.51 లక్షల కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేశాయి'' అని తెలిపారు.

''తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు 2.00 లక్షల కేసులు అమ్మకాలు జరుగుతాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రెవరీస్‌ కార్పొరేషన్‌ డిపోల్లో, బ్రూవరీస్‌ల్లో నిల్వలు ఉన్నాయి. మొత్తంగా మార్కెట్‌లో బీరు కొరత లేదు. కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ కొరత తప్పా మిగిలిన అన్ని రకాలు బీర్లు అందు బాటులో ఉన్నాయి. బీరు తయారు చేసే కంపెనీలు మూడు షిప్టుల అనుమతి తీసుకున్న కూడ తగిన బీరు ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కింగ్‌ బీరు కొతర కొరత ఏర్పడిరది. అయిప్పటికి ఎక్సైజ్‌ శాఖ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకొని బీరు నిల్వలకు కొరత లేకుండా చూసింది'' అని పేర్కొన్నారు.

''తెలంగాణలో కొత్త బ్రాండ్‌ల అనుమతికి సంబంధించి చాల సంవత్సరాలుగా ఉన్న పద్దతిని కొనసాగిస్తున్నారు. కొత్త సంస్థలు తమ బ్రాండ్స్‌ను తెలంగాణ బేవరీజెస్‌ కార్పోరేషన్‌కు సరఫరా చేయడానికి బ్రెవరీజెస్‌ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అన్నవారికి అనుమతించడం జరుగుతుంది. గత ఐదేళ్లలో తెలంగాణలో దాదాపు 360 కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. గడిచిన ఐదు నెల్లలో నాలుగు బీరు బ్రాండ్స్‌ను సరఫరా చేయుటకు కార్పొరేషన్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాల్లో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని భావిస్తున్నాం'' అని ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది.

Next Story