'ఈటలను చంపేందుకు కుట్ర జరుగుతోంది'.. ఈటల జమున సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటలను చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు.
By అంజి
'ఈటలను చంపేందుకు కుట్ర జరుగుతోంది'.. ఈటల జమున సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటలను చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. 20 కోట్ల రూపాయలు ఇచ్చి ఈటలను చంపిస్తానని పాడి కౌశిక్ రెడ్డి అన్నట్లు తెలిసిందన్నారు. ఈటలను చంపేస్తామంటే భయపడేదే లేదన్నారు. కౌశిక్ రెడ్డి మాటల వెనక కేసీఆర్ ఉన్నారని, ఇలాంటి సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా? అని ఈటల జమున ప్రశ్నించారు. రూ.20 కోట్లతో కాదని, ప్రజలు ఓటుతో కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. సీఎం కేసీఆర్.. శాడిస్టులను పక్కన పెట్టుకుని పరిపాలని సాగిస్తున్నాడని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని.. కేసీఆర్ హుజురాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారని అన్నారు.
కేసీఆర్ ప్రొత్సాహంతో కౌశిక్ రెడ్డి హుజురాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నాడని అన్నారు. పదవుల కోసం ఈటల తలవంచరని అన్నారు. ఈటల బీజేపీలోనే ఉంటారని.. ఆయన పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాగా ఈటల జమున వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈటల రాజేందర్ 2021లో టీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బై ఎలక్షన్‌లో గెలుపొందారు. అదే సమయంలో అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.