తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఇంట్లో చోరీ.. పోలీసులకు కంప్లయింట్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఇంట్లో చోరీ జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

By Knakam Karthik
Published on : 17 Jan 2025 10:43 AM IST

telangana, tg police, theft, ex minister ponnala lakshmaiah

తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఇంట్లో చోరీ.. పోలీసులకు కంప్లయింట్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఇంట్లో చోరీ జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. రూ.లక్షన్నర నగదుతో పాటు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు పొన్నాల లక్ష్మయ్య సతీమణి పొన్నాల అరుణా దేవి కంప్లయింట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story