అసోసియేట్ ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్..ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం

తెలంగాణలో మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

By Knakam Karthik
Published on : 23 July 2025 5:27 PM IST

Telangana, Health Medical And Family Welfare Department, Promotions, Associate Professors, Professors

అసోసియేట్ ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్..ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం

తెలంగాణలో మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవలే 44 మంది ప్రొఫెసర్లకు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్లకు.. ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించింది. మొత్తం 33 స్పెషాలిటీ విభాగాల్లో 309 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీరనుంది. త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీల అభివృద్ధి, ఫాకల్టీ కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇటీవల నేషనల్ మెడికల్ కమిషన్ ప్రశంసించింది. ఒక్క సీటుకు కూడా కోత పెట్టకుండా, ఒక్క రూపాయి జరిమానా విధించకుండా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు కొనసాగిస్తున్నట్టు ఇటీవలే ఎన్‌ఎంసీ ప్రకటించింది.

Next Story