రాష్ట్రానికి 4 రోజుల పాటు వర్షసూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణకు నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
By Knakam Karthik
రాష్ట్రానికి 4 రోజుల పాటు వర్షసూచన..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణకు నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ్టి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతోనే పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
రేపు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో..శనివారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్; నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో..ఆదివారం ఆదిలాబాద్, కుమురంభీంఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.