తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ మాధవి దేవి తుది తీర్పును వెలువరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో వార్డుల విభజన చేయాలని ధర్మాసనం పేర్కొంది.
కాగా ఎన్నికల నిర్వహణకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం, 60 రోజుల గడువు కావాలని హైకోర్టును ఎన్నికల సంఘం కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు వెలువరించిన తీర్పుతో రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సెప్టెంబర్‌లోపు జరగనున్నాయి.