బాలిక అదృశ్యం.. గోనె సంచిలో శ‌వ‌మై..

చిన్నారి బాలిక ఒక్కసారిగా అదృశ్యమైంది.

By Kalasani Durgapraveen  Published on  15 Oct 2024 4:50 PM IST
బాలిక అదృశ్యం.. గోనె సంచిలో శ‌వ‌మై..

చిన్నారి బాలిక ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆమె కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లి దండ్రులకు నిరాశే ఎదురయింది. ఒక్కసారిగా కూతురి మృతదేహాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తుండడంతో చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఇంతటి విషాదక రమైన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ 12 సంవత్సరాల వయసు గల బాలిక ఇంటి ముందు ఆడుకుంటూ ఒక్కసారి గా అదృశ్యమైంది. బాలిక కనిపించక పోవడంతో ఆ తల్లి దండ్రులు కంగారు పడి చుట్టుపక్కల ప్రాంతాలు, మరియు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా కూడా బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడం తో వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసు కున్న పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నిన్నటి నుండి బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. చివరకు పోలీసులు మేడ్చల్లో ఒక గోనె సంచిలో బాలిక మృతదేహం ఉన్నట్లుగా కనుక్కు న్నారు. అయితే దుండగులు బాలికను ఎత్తుకెళ్లి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పి టల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు బాలికను కిడ్నాప్ చేసిన నిందితుల కోసం వెతుకుతున్నారు.

Next Story