హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లో అధికార లాంఛనాలతో ముగిశాయి. ఆయన భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందెశ్రీ పాడె మోశారు. అందెశ్రీ అంతిమ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు జూపల్లి, శ్రీధర్‌బాబు, అడ్లూరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వి.హనుమంతు రావు, విమలక్క తదితరులు పాల్గొన్నారు.
లాలాపేట జయశంకర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ అంతిమయాత్ర ఘట్కేసర్కు వరకు సాగింది. ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య అధికారిక లాంఛనాలతో జరిగాయి. అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తన శరీరమంతా బిగుసుకుపోయి ఉందని, గుండెపోటుతో మరణించి ఉంటారని వైద్యులు తెలిపారు.