అలర్ట్..తెలంగాణలో స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్

తాజాగా స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది.

By -  Knakam Karthik
Published on : 31 Dec 2025 7:06 AM IST

Telangana, Pathologist posts, first merit list, Telangana Medical and Health Services Recruitment Board

అలర్ట్..తెలంగాణలో స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పీడ్ పెంచింది. ఇటీవలే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు, తాజాగా స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరి వివరాలను మంగళవారం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

అభ్యర్థి అకాడమిక్ క్వాలిఫికేషన్‌లో సాధించిన మార్కులు, వెయిటేజీ ద్వారా సాధించిన మార్కులు, వారి స్థానికతకు సంబంధించిన అంశాలు సహా అన్ని వివరాలను వెబ్‌సైట్‌లో (http://mhsrb.telangana.gov.in/) అందుబాటులో ఉంచామని, వీటిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని బోర్డు కోరింది.

అభ్యంతరాలను జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేయాలని సూచించింది. అభ్యంతరాలను అభ్యర్థి లాగిన్ ద్వారా మాత్రమే నమోదు చేయాలని, ఆఫ్‌లైన్‌లో పంపించిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని బోర్డు స్పష్టం చేసింది. మల్టీ జోన్-I పరిధిలో ఎటువంటి పోస్టులు నోటిఫై చేయనందున, ఆ జోన్‌కు చెందిన అభ్యర్థులను పోస్టుల కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని బోర్డు స్పష్టం చేసింది.

Next Story