మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ ఏజేంట్‌పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారంలో పేదల భూములు కబ్జాకు గురవుతున్న విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ఆగ్రహంతో దాడి చేయడంతో, అక్కడికి వచ్చిన ఆయన అనుచరులు కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పేదల భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.