తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 120 దేశాలకు చెందిన అందాల భామలు పోటీల్లో పాల్గొననుండగా, మన దేశం నుంచి నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ ట్యాగ్‌లైన్‌తో ఈ పోటీలు జరగనున్నాయి. వెయ్యి మందికిపైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరుకానున్నారు. మిస్‌వరల్డ్ ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అటు భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా నేటి నుంచి మొదలయ్యే మిస్‌వరల్డ్ పోటీలు జూన్ 2న ముగుస్తాయి. మొత్తం 23 రోజుల పాటు సాగే పోటీల్లో కీలకమైన గ్రాండ్ ఫినాలె ఈ నెల 31న హైటెక్స్‌లో జరగుతుంది. తెలంగాణలోని టూరిస్ట్ ప్లేస్‌లను, హెల్త్టూరిజాన్ని ప్రమోట్‌చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోటీల నిర్వహణకు ముందుకొచ్చింది. కాగా అందాల పోటీల్లో భాగంగా తొలిరోజు కంటెస్టెంట్స్ పరిచయ కార్యక్రమం ఉంటుంది.