కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. క‌డియంపై తాటికొండ రాజయ్య ఫైర్‌

కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.

By Medi Samrat  Published on  3 Jan 2025 3:30 PM IST
కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. క‌డియంపై తాటికొండ రాజయ్య ఫైర్‌

కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్ల‌డుతూ.. కడియం శ్రీహరీ నీది నాలికా తాటి మట్టా..? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు అన్నం తింటున్నవా.. గడ్డి తింటున్నావా.. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అని హెచ్చ‌రించారు. న‌మ్మ‌క‌ద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన.. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా ఉమ్మేస్తున్నారు.. 1994 కు ముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? అని ప్ర‌శ్నించారు. 30 ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు.. నీ ఇళ్ళు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం అన్నారు.. విదేశాలలో నీ ఆస్తులే సాక్ష్యం.. ఇంకొకసారి నీతి, నిజాయితీ గురించి మాట్లాడవద్దు అని మండిప‌డ్డారు.

Next Story