మహా శివ రాత్రి సందర్భంగా ఈ నెల 24 నుంచి 28 వరకు 43 శైవ క్షేత్రాలకు 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేసింది. మిగతా ప్రత్యేక బస్సులు కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం, కొమరవెల్లి, అలంపూర్, రామప్పతో పాటు ఇతర శైవ క్షేత్రాలకు నడుస్తాయని పేర్కొంది.
వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని తెలిపింది. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపింది. గత శివరాత్రితో పోలిస్తే ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారు. టికెట్ల బుకింగ్‌ను.. వెబ్‌సైట్ లో చేసుకోవచ్చు.