కరెంట్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..TGSPDCL వాట్సాప్ సేవలు షురూ

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) విద్యుత్ వినియోగదారుల కోసం సరికొత్త వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది

By -  Knakam Karthik
Published on : 22 Feb 2026 9:00 PM IST

Telangana, TGSPDCL, WhatsApp Chatbot, Digital Governance, Electricity Services

కరెంట్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..TGSPDCL వాట్సాప్ సేవలు షురూ

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) విద్యుత్ వినియోగదారుల కోసం సరికొత్త వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా విద్యుత్ సేవలను మరింత సులభంగా, వేగంగా మొబైల్ నుండే పొందవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ నుండే తక్షణమే విద్యుత్ సేవలను పొందేలా ఈ డిజిటల్ సౌకర్యాన్ని కల్పించారు.

దీని కోసం వినియోగదారులు 8712441912 నంబర్‌ను తమ ఫోన్లలో సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో "Hi" అని మెసేజ్ పంపితే చాలు. ఈ చాట్‌బాట్ ద్వారా విద్యుత్ ఫిర్యాదులు నమోదు చేయడం, బిల్లు వివరాలు తెలుసుకోవడం, విద్యుత్ సరఫరా స్థితిగతులను తనిఖీ చేయడం వంటి పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కస్టమర్ కేర్‌కు గంటల తరబడి ఫోన్ చేయకుండా 24 గంటల పాటు ఎక్కడి నుండైనా ఈ సేవలను పొందవచ్చని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం తీసుకొచ్చిన ఈ అధికారిక వాట్సాప్ నంబర్‌ను అందరూ ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

అందుబాటులో ఉన్న సేవలు:

విద్యుత్ ఫిర్యాదుల నమోదు (Complaints).

బిల్లు వివరాల తనిఖీ (Billing Details).

విద్యుత్ సరఫరా స్థితి (Power Supply Status).

Next Story