Telangana: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై అప్‌డేట్‌

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూకీ కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి
Published on : 21 March 2025 1:30 PM IST

tgspdcl CMD, musharraf, electricity tariffs, Telangana

Telangana: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై అప్‌డేట్‌

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూకీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం ఛార్జీల పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ ముందు టారిఫ్ ప్రతిపాదనలను ఉంచిన తర్వాత ఈ విషయాన్ని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు విద్యుత్‌ నియంత్రణ భవన్‌లో ఈఆర్సీ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ డి. నాగార్జున అధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది.

టీజీఎస్పీడీసీఎల్‌ ఆదాయ ఆవశ్యకత, రిటైల్‌ సరఫరా ప్రతిపాదనలపై జరిగిన విచారణకు సీఎండీ, జేఎండీ శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సంవత్సరం ఆదాయ అంతరం రూ. 9,758 కోట్లు అని సీఎండీ తెలిపారు. సబ్సిడీల ద్వారా ప్రభుత్వమే ఈ ఆదాయ అంతరాన్ని పూరించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. కాగా నిన్న ఎన్పీడీసీఎల్‌ కూడా ఛార్జీలు పెంపునకు ప్రతిపాదించట్లేదని తెలిపింది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రసార వ్యవస్థపై గరిష్ట విద్యుత్ భారం గురువారం సాయంత్రం 4.39 గంటలకు రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరుకుంది.

Next Story