హైదరాబాద్: గ్రూప్-1పై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. టీజీపీఎస్సీ జరిపిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే కోర్టుకు టీజీపీఎస్సీ వెళ్లనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యూయేషన్ చేస్తే సాంకేతిక సమస్యలు రావొచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడింది.
ఈ మేరకు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో TGPSC పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రీవాల్యుయేషన్ చేస్తే టెక్నికల్ సమస్యలు వస్తాయని TGPSC అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సింగల్ బెంచ్ తీర్పు కాపీపై లీగల్ టీమ్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది. గ్రూప్-1 నియామకాల్లో లోపాలు లేవని TGPSC వాదించడానికి సిద్ధం అయ్యింది.