నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీజీపీఎస్సీ

నిరుద్యోగులకు టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ మార్చి 31 లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు.

By అంజి  Published on  9 Jan 2025 6:42 AM IST
TGPSC, unemployed, Telangana, Burra Venkatesham

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీజీపీఎస్సీ

నిరుద్యోగులకు టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ మార్చి 31 లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు. కొత్త నోటిఫికేషన్లు మే 1 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తామన్నారు. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్‌ -1, 2, 3 ఫలితాలు రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ఫార్మాట్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గ్రూప్‌-2 'కీ'ని రేపు (జనవరి 10) విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు.

గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవని అన్నారు. భవిష్యత్తులో పెండింగ్‌ అనేది ఉండదని స్పష్టం చేశారు. టీజీపీఎస్సీలో సైంటిఫిక్‌ డిజైన్‌ లోపించిందని, అందుకే పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్టు చెప్పారు. కాగా గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన 'కీ'ని నిన్న టీజీపీఎస్సీ రిలీజ్‌ చేసింది. ఇంటర్వ్యూ ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏడాది వ్యవధిలో, లేని వాటిని ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించింది.

Next Story