Telangana: 'పీఎం కుసుమ్' దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం కుసుమ్ పథకం కింద పొలాల్లో రైతులు సొంతంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్లికేషన్ గడువు పొడిగించబడింది.
By అంజి Published on 4 March 2025 8:36 AM IST
Telangana: 'పీఎం కుసుమ్' దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం కుసుమ్ పథకం కింద పొలాల్లో రైతులు సొంతంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్లికేషన్ గడువు పొడిగించబడింది. దరఖాస్తు గడువును ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు తమ పొలంలో ప్లాంటు ఏర్పాటుకు రెడ్కో పోర్టల్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చుని సూచించింది. రైతులు, డ్వాక్రా మహిళలు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు ఈ పథకానికి అర్హులు.
కేంద్ర ప్రభుత్వం మార్చి 2019 లో పీఎం కుసుమ్ పథకాన్ని ప్రారంభించింది. దీనిని జనవరి 2024లో విస్తరించారు. రైతులకు కరెంట్ కష్టాలు తీర్చడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని డీ-డీజిలైజేషన్ చేయడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. తుల తమ పొలాల్లో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం సబ్సిడీ అందిస్తాయి. పీఎం కుసుమ్ అధికారిక వెబ్‌సైట్ pmkusum.mnre.gov.in లో పూర్తి వివరాలు ఉంటాయి. రైతు తాను వినియోగించుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. ఇందుకు రైతులు డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.