తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్కూల్, ఇంటర్ విద్యార్థులు ఇప్పటికే వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తుండగా డిగ్రీ స్టూడెంట్లకూ ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయా విశ్వ విద్యాలయాల్లో చదువుతోన్న విద్యార్థులు ప్రభుత్వ వేసవి సెలవులను ప్రకటించింది.
రాష్ట్రంలోని 30 సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలకు మే నెలాఖరు వరకు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయాల పరిధిలో సోమవారం నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఉస్మానియా విద్యార్థులకు మే 1 నుంచి 30 వరకు, మహాత్మాగాంధీ, కాకతీయ విశ్వవిద్యాలయాలకు మే 31 వరకు, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు జూన్ ఒకటి వరకు సెలవులు ప్రకటించారు. పాలమూరు యూనివర్సిటీకి మే 2 నుంచి జూన్ 1 వరకు సెలవులను సవరించారు.