హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నిన్న టెట్ ప్రిలిమినరీ 'కీ'తో పాటు రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా ఈ నెల 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఫలితాల విడుదల తర్వాత ఏప్రిల్‌లో సుమారు 5 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రావాలి. కానీ ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ వేసిన ప్రభుత్వం నివేదిక కోసం ఎదురుచూస్తోంది. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోవచ్చని తెలుస్తోంది. ఇక గత సంవత్సరం 11,062 పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరో 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది.