విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ‌లో నేటి నుంచి ప‌దో తరగతి హాల్‌ టికెట్లు జారీ

Tenth Class hall tickets will be issued from Today in Telangana.తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఈ నెల 23

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2022 2:44 AM GMT
విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ‌లో నేటి నుంచి ప‌దో తరగతి హాల్‌ టికెట్లు జారీ

తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేటి(గురువారం) నుంచి విద్యార్థుల‌కు హాల్ టికెట్లు జారీ చేయ‌నున్నారు. ఈమేర‌కు ఇప్ప‌టికే ఆయా పాఠ‌శాల‌ల‌కు హాల్ టికెట్లు పంపిన‌ట్లు డైరెక్ట‌ర్ కృష్ణారావు తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థులు హాల్‌ టికెట్లు తీసుకోవ‌చ్చున‌ని చెప్పారు. అంతేకాకుండా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కూడా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయ‌న్నారు. www.bse.telangana.gov.in నుంచి సైతం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చున‌ని అన్నారు. ఈ నెల 23 నుంచి జూన్ 1 వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను అధికారులు ఇప్ప‌టికే పూర్తి చేశారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వారిని ప్ర‌త్యేక గ‌దుల్లో ప‌రీక్ష రాయించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

ప‌దో త‌ర‌గ‌తి షెడ్యూల్ ఇదే..

మే 23- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్ గ్రూప్-ఏ

మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)

మే 23- ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)

మే 24- సెకండ్ లాంగ్వేజ్..

మే 25- థర్డ్ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌)

మే 26- మ్యాథమెటిక్స్‌

మే 27- జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌)

మే 28- సోషల్‌ స్టడీస్‌

మే 30 – ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 1 (సంస్కృతం, అరబిక్‌)

మే 31- ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌)

జూన్ 1- ఎస్‌ఎస్‌సీ ఓకేషనల్ కోర్స్‌ (థియరీ)

Next Story