బూర్గుల్‌ కమాన్‌ దగ్గర ఉద్రిక్తత.. బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం

Tension near Burgul Kaman.. Police stopped BJP leader Vivek. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం బొగ్గుగుడిసె బూర్గుల్‌ కమాన్‌ దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

By అంజి  Published on  22 July 2022 6:43 AM GMT
బూర్గుల్‌ కమాన్‌ దగ్గర ఉద్రిక్తత.. బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం బొగ్గుగుడిసె బూర్గుల్‌ కమాన్‌ దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. కమాన్‌ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. నిన్న బీజేపీ భరోసా యాత్ర నేపథ్యంలో బూర్గుల్‌లో బీజేపీ జెండా గద్దెను కూల్చివేశారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ నెలకొంది అయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగుర వేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. దీంతో బూర్గుల్ కమాన్ చుట్టూ పోలీసు బలగాలు మోహరించారు.

బూర్గుల్‌ కమాన్‌ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి, పలువురు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు చెప్పినా పోలీసులు వినలేదు. జెండా ఎగురవేసేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో వివేక్‌ వెంకటస్వామి, బీజేపీ నేతలుపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల హక్కులను కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని, పోలీసులు తమను కొట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. తర్వాత టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వివేక్ వెంకటస్వామితోపాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా బూర్గుల్‌ కమాన్‌ దగ్గర బీజేపీ జెండా ఎగరవేస్తామని వివేక్‌ వెంకటస్వామి చెప్పారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పిరికిపంద అని వివేక్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను అడ్డుకోవడం సరికాదని, బూర్గుల్‌లో జెండా ఎగరేయకుండా ఇక్కడి నుంచి వెళ్తే ప్రసక్తే లేదన్నారు. అవసరం అయితే పోలీసుల తీరుకు నిరసనగా యాత్ర వాయిదా వేస్తామన్నారు. బూర్గుల్ గ్రామంలో పోలీసుల అత్యుత్సాహంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Next Story