మొదటిసారి విమానం ఎక్కిన గంగవ్వ.. రియాక్షన్‌ ఎలా ఉందంటే?

62 ఏళ్ల గంగవ్వ తన జీవితంలో మొట్టమొదటి సారిగా విమానం ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on  10 March 2023 5:15 PM IST
YouTuber Gangavva, Telangana

మొదటిసారి విమానం ఎక్కిన గంగవ్వ.. వీడియో

యూట్యూబర్‌గా మారిన వ్యవసాయ కూలీ మారిన మిల్కూరి గంగవ్వ.. తెలంగాణ ఇళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె అమాయకత్వం, ఆమె మాటలు.. ఆమెను ఓ సెలబ్రెటీని చేశాయి. ప్రత్యేకించి తెలంగాణ మాండలికంలో ఆమెకున్న ప్రావీణ్యం అద్భుతం. 62 ఏళ్ల గంగవ్వ తన జీవితంలో మొట్టమొదటి సారిగా విమానం ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గంగవ్వ తొలిసారి విమానం ఎక్కిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోను గంగవ్వ అఫీషియల్ ఇన్ స్టా పేజ్లో పోస్ట్ చేశారు. దీనికి విమానం ఎక్కిన... అని తెలుగులో రాసిన క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. "ఫ్లైట్ ఎక్కిన ఒక మహిళ #ఫస్ట్ ఫ్లైట్ #ఫస్ట్ టైం ఫ్లైట్ అనుభవం" అని అందులో రాశారు.

మొదటి సారి విమానం ఎక్కిన తర్వాత గంగవ్వ పలికిన హావభావాల వైరల్ వీడియో నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది. 'తెలుగు బిగ్ బాస్' పార్టిసిపెంట్ గంగవ్వ.. బోర్డింగ్ పాస్‌ నుండి నేరుగా విమానంలోకి అడుగుపెట్టింది. టేకాఫ్ సమయంలో తనకు భయంగా ఉందని, సీటు బెల్టు పెట్టుకునేందుకు ప్రయత్నించానని గంగవ్వ చెప్పింది. విమానం ఎగరడం చూసి గంగవ్వ చాలా ఆశ్చర్యపోయింది. ఆమె మొదటిసారి విమానంలో ప్రయాణించడం వల్ల విమానం, గాలి శబ్దాలు తన చెవికి ఇబ్బంది పెట్టినట్లు వీడియోలో తెలిపింది. కాగా గంగవ్వ ఇప్పటికే పలు సినిమాల్లో కూడా నటించింది.

Next Story