పెంపుడు కుక్క మరణించడంతో తెలంగాణ దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి కొండా సురేఖ నివాసంలో ఉన్న పెంపుడు కుక్క హఠాన్మరణం చెందడంతో.. మంత్రితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క (హ్యాపీ) చనిపోవడంతో.. దాని ముందు నిల్చోని.. మంత్రి కొండా సురేఖతో పాటు ఆమె సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న హ్యాపీ చనిపోవడంతో మంత్రి బాధాతప్త హృదయంతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.