ColdWaveWarning: తెలంగాణలో రేపటి నుంచి 12వ తేదీ వరకు జాగ్రత్త

తెలంగాణలో రేపటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని తెలంగాణ వెదర్‌మన్( బాలాజీ) అంచనా వేశారు.

By -  Knakam Karthik
Published on : 4 Jan 2026 4:00 PM IST

Telangana, Weather News, Cold Wave Warning, Telangana Weatherman, Cold Wave

ColdWaveWarning: తెలంగాణలో రేపటి నుంచి 12వ తేదీ వరకు జాగ్రత్త

తెలంగాణలో రేపటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని తెలంగాణ వెదర్‌మన్( బాలాజీ) అంచనా వేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తీవ్ర చలి గాలులు వీస్తాయని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. రోజు సమయంలో ఉష్ణోగ్రతలు 25-26 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిరోజులుగా పొగ మంచు ఉంటున్నా చలి తీవ్రత తగ్గిన విషయం తెలిసిందే.

అయితే డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతతో ప్రజలంతా గజగజ వణికిపోయారు. ఉదయం, రాత్రి వేళలో బయటికి వెళ్లలేని పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా పొగమంచు పరిస్థితులతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, తాజా హెచ్చరికల నేపథ్యంలో ఆ పరిస్థితి మారిపోయి, చలి గాలుల ఉధృతి పెరగనుంది. వృద్ధులు, చిన్నపిల్లలు చలి ప్రభావానికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాబోయే పది రోజుల పాటు ప్రయాణాలు చేసే వారు కూడా వాతావరణ పరిస్థితులను బట్టి తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఉత్తమం.

Next Story