హైదరాబాద్: గ్రామ పంచాయతీలు, వార్డు ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సవరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పొరపాట్ల సవరణకు ఈ ఒక్కరోజు మాత్రమే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 22న జిల్లా పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 23వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. https://tsec.gov.in/లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకుని తప్పులు ఉంటే గ్రామ పంచాయతీలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
గ్రామ పంచాయతీల్లో ఓటరు సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న ప్రచురితమైన జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ రోజు వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు తెలిపింది. వాటిపై డీపీవో పరిశీలన చేస్తారని పేర్కొంది. ఈ నెల 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని వెల్లడించింది. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.