డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. రూ. 2,75, 891 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారు. ప్రస్తుతం ఆయన బడ్జెట్ లెక్కలను సభలో వివరిస్తున్నారు. తెలంగాణ బడ్జెట్ 2,75, 891 కోట్లు కాగా.. ఇది గతేడాది కన్నా రూ. 51,266 కోట్లు అధికం.. రెవెన్యూ వ్యయం రూ. 2, 01, 178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ. 29, 669 కోట్లుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ త్యాగమూర్తుల ఆశయ సాధన దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మాక మార్పు తెస్తామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.నిస్సాహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సమానత్వమే తమ ప్రభుత్వ విధానమన్నారు. అందరి కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకు వెళ్తామన్నారు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని భట్టి హామీ ఇచ్చారు.ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారెంటీలను ప్రకటించామని చెప్పారు. ఆ గ్యారెంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.