ఘ‌నంగా తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు

Telangana Unity Vajrotsavalu Started.తెలంగాణ ప్రాంతం రాచ‌రిక వ్య‌వ‌స్థ నుంచి ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చి 75వ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sept 2022 1:28 PM IST
ఘ‌నంగా తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు

తెలంగాణ ప్రాంతం రాచ‌రిక వ్య‌వ‌స్థ నుంచి ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చి 75వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న త‌రుణంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాది పాటు వేడుక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగా శుక్ర‌వారం నుంచి మూడు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న వజ్రోత్సవ ప్రారంభ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి.


అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, విద్యార్థులు, యువ‌తీ, యువ‌కులు, మ‌హిళ‌లు ఇందులో భాగ‌స్వామ్యం అయ్యారు. సికింద్రాబాద్‌లోని ప్యార‌డైజ్ నుంచి గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు చేప‌ట్టిన ర్యాలీని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్రారంభించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీశ్‌ ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్‌పేట్‌ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బడంగ్‌పేట్‌ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆ ప్రదర్శనను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.





Next Story