ఆయుష్మాన్ భారత్‌లోకి తెలంగాణ‌

Telangana to implement Ayushman Bharat with immediate effect.ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది.

By Medi Samrat
Published on : 18 May 2021 9:50 PM IST

CM KCR

కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంఓయు కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈమేరకు, ఆరోగ్యశాఖ సెక్రటరీ శ్రీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓ కు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.


Next Story