అభ్యర్థులకు అలర్ట్‌.. నేటి నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌) దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

By అంజి
Published on : 15 April 2025 2:24 AM

Telangana, TET applications, Teacher Eligibility Test

అభ్యర్థులకు అలర్ట్‌.. నేటి నుంచి టెట్‌ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌) దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా ఫీజు నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే హెల్ప్‌ డెస్క్‌: 70939 58881, 70934 68882 కాల్‌ చేయవచ్చు. ఈ నంబర్లు ఈ నెల 15 నుంచి జులై 22 వరకు అందబాటులో ఉంటాయి. టెట్‌ పరీక్షలు జూన్‌ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ ఈ నెల 11న విడుదల అయింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్​ను https://schooledu.telangana.gov.in వెబ్ సైట్​లో వెళ్లి చూడొచ్చు. కాగా ప్రతి ఏటా రెండుసార్లు టెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story